‘దసపల్లా’ భూములపై ఆలస్యంగా సుప్రీంకోర్టుకు

విశాఖ నగరంలోని ‘దసపల్లా’ భూములపై ఆలస్యంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన అప్పటి విశాఖ అర్బన్‌ తహసీల్దార్‌, ప్రస్తుత కడప ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న పి.ధర్మచంద్రారెడ్డిపై చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated : 29 Mar 2023 05:31 IST

ఫలితంగా హైకోర్టు తీర్పే అమలు చేయాలని ఆదేశం
నాటి విశాఖ అర్బన్‌ తహసీల్దార్‌, ప్రస్తుత కడప ఆర్డీవోపై చర్యలు
ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు.. ఆలస్యంగా వెలుగులోకి

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగరంలోని ‘దసపల్లా’ భూములపై ఆలస్యంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన అప్పటి విశాఖ అర్బన్‌ తహసీల్దార్‌, ప్రస్తుత కడప ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న పి.ధర్మచంద్రారెడ్డిపై చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌ ఈ మేరకు ఫిబ్రవరి 20న దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సివిల్‌ సర్వీసు నిబంధనల ప్రకారం ధర్మచంద్రారెడ్డిపై జరిగిన విచారణ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ‘సెన్‌స్యూర్‌’ చర్యలకే పరిమితమైంది. ఉద్యోగులపై తీసుకునే క్రమశిక్షణచర్యల్లో అతి తక్కువ చర్యగా ‘సెన్‌స్యూర్‌’ను పేర్కొంటారు. ఈ భూములు ప్రైవేటువ్యక్తుల చేతుల్లోకి వెళ్లాక...అధికారిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించడం గమనార్హం. ప్రభుత్వం విలువైన భూములను కోల్పోయే పరిస్థితి కల్పించినా చిన్నపాటి చర్యలతో సరిపెట్టడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు పేర్కొంటున్నారు. మిగిలిన అధికారులు, ఇతర వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నది బయటకు రాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని