నేడు దిల్లీకి ముఖ్యమంత్రి జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు.

Updated : 29 Mar 2023 05:34 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో సీఎం దిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ సాయంత్రమే ఉంటే రాత్రికి తిరిగి రానున్నారు. భేటీ ఆలస్యమైతే బుధవారం రాత్రి దిల్లీలోనే బస చేసి గురువారం తిరిగి వస్తారు.

వరుస పర్యటనలపై చర్చలు: సీఎం జగన్‌ వరుస దిల్లీ పర్యటనలపై రాజకీయవర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 17నే దిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి వచ్చిన ముఖ్యమంత్రి, ఇప్పుడు రెండు వారాలు కూడా పూర్తికాకుండానే మళ్లీ కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు వెళ్లనుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 17న దిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని, కేంద్ర హోంమంత్రికి ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన వినతిపత్రాల వివరాలు వెల్లడికాలేదు. ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆ రోజున జారీ చేసిన ప్రకటనలోనూ పోలవరానికి నిధులను అడిగారు, ప్రత్యేకహోదా ప్రస్తావించారు అంటూ పాత విషయాలనే పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి సీఎం దిల్లీకి ఎందుకు వెళుతున్నారనేదీ చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని