ప్రతి నెలా ఇంధన సర్దుబాటు ఛార్జీలు

ఇంధన సర్దుబాటు ఛార్జీలను ఇప్పటి వరకు మూడు నెలలకు ఓసారి వసూలు చేస్తుండగా... ఇకపై ఏ నెలకు ఆ నెల వసూలు చేసేలా    డిస్కంలకు అనుమతిస్తూ ఏపీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఏపీఈఆర్సీ) ఆదేశాలు జారీ చేసింది.

Published : 30 Mar 2023 04:10 IST

యూనిట్‌కు 40 పైసల వరకు వసూలు చేసుకునేందుకు అనుమతి
రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు
ఏపీఈఆర్సీ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ఇంధన సర్దుబాటు ఛార్జీలను ఇప్పటి వరకు మూడు నెలలకు ఓసారి వసూలు చేస్తుండగా... ఇకపై ఏ నెలకు ఆ నెల వసూలు చేసేలా    డిస్కంలకు అనుమతిస్తూ ఏపీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఏపీఈఆర్సీ) ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేటగిరీలకు యూనిట్‌కు 40 పైసలు చొప్పున వసూళ్లు చేసుకునే ప్రతిపాదనకు డిస్కంలకు అనుమతిస్తూ బుధవారం గెజిట్‌ ప్రచురించింది. ఈ మేరకు ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ యాక్ట్‌కు సవరణ చేసింది. ఫిబ్రవరి 10న ముసాయిదా సవరణ ప్రచురించి... అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించింది. రాష్ట్రంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ఇంధన,    విద్యుత్‌ కొనుగోళ్ల ఖరీదు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) ఫార్ములా ప్రకారం ఈ ఛార్జీలు ఉండనున్నాయి.  ప్రతి నెలా వసూళ్లు చేసే మొత్తంతో పాటు సంవత్సరం చివరలో ఇంధన సర్దుబాటు ఛార్జీకి మించి ఉంటే.. అదనంగా వసూళ్లు చేయనున్నారు. ఒకవేళ తక్కువ ఉంటే (ట్రూ డౌన్‌).. దానిని ఆ తర్వాత బిల్లుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు