ఉప ముఖ్యమంత్రికి నిరసన సెగ

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించలేదని ఆయన్ను మహిళలు నిలదీశారు.

Published : 30 Mar 2023 04:42 IST

కార్వేటినగరం, న్యూస్‌టుడే: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించలేదని ఆయన్ను మహిళలు నిలదీశారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని పద్మ సరస్సు గ్రామం, గొల్లయిండ్లు, తూర్పు హరిజనవాడలో బుధవారం ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆయన ఆయా గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సమస్యలను ఏకరవు పెట్టారు. పద్మ సరస్సు గ్రామంలో రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు మంజూరు చేయాలని కోరారు. గొల్లయిండ్లులో మురుగునీటి కాల్వకు మూతలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తూర్పు హరిజనవాడలో గుట్టపై నివసిస్తున్న కుటుంబాలకు రోడ్డు సౌకర్యం, మురుగునీటి కాలువలు ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని