దళిత యువకుడి కుటుంబానికి రెండెకరాల భూమి, ఇంటి స్థలం

కాకినాడ జిల్లా శృంగవృక్షంలో ఇటీవల గ్రామదేవత జాతరలో చోటు చేసుకున్న ఘర్షణలపై విచారణను వేగవంతం చేస్తున్నామని, నిందితులను వదిలే ప్రసక్తి లేదని ఆర్‌అండ్‌బీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.

Published : 30 Mar 2023 04:42 IST

అందజేసిన మంత్రి దాడిశెట్టి రాజా

తొండంగి, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా శృంగవృక్షంలో ఇటీవల గ్రామదేవత జాతరలో చోటు చేసుకున్న ఘర్షణలపై విచారణను వేగవంతం చేస్తున్నామని, నిందితులను వదిలే ప్రసక్తి లేదని ఆర్‌అండ్‌బీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. ఘటనలో మృతి చెందిన దళిత యువకుడు రాము కుటుంబాన్ని తొండంగి గ్రామంలో కలెక్టర్‌ కృతికా శుక్లాతో కలిసి బుధÅవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు రెండెకరాల భూమి పట్టా, ఇంటి స్థలం, మృతుని తల్లికి పింఛను, ఉద్యోగానికి సంబంధించిన పత్రాలను కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు. గాయాలపాలైన శృంగవృక్షం గ్రామానికి చెందిన ఏడుగురికి రూ.50 వేల చొప్పున అందించారు. వీటితో పాటు ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందిస్తామన్నారు. డీఎస్పీ మురళీమోహన్‌, ఆర్డీవో సీతారామారావు, ఇతర అధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని