సాగర తీరంలో సాహస ప్రదర్శన

కాకినాడ సముద్ర తీరం నుంచి సుమారు 20 కి.మీ. దూరంలో ఇండియన్‌ కోస్ట్‌గార్డు ఆధ్వర్యంలో బుధవారం రీజినల్‌ సెర్చ్‌, రెస్క్యూ ఎక్సర్‌సైజ్‌(సారెక్స్‌-2023) నిర్వహించారు.

Published : 30 Mar 2023 05:38 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ సముద్ర తీరం నుంచి సుమారు 20 కి.మీ. దూరంలో ఇండియన్‌ కోస్ట్‌గార్డు ఆధ్వర్యంలో బుధవారం రీజినల్‌ సెర్చ్‌, రెస్క్యూ ఎక్సర్‌సైజ్‌(సారెక్స్‌-2023) నిర్వహించారు. కోస్ట్‌గార్డ్‌ కాకినాడ స్టేషన్‌ ఆధ్వర్యంలో సముద్రంలో విపత్తుల స్పందన, నిర్వహణపై నిర్వహించిన ఈ మాక్‌డ్రిల్‌ అబ్బురపరిచింది. రిమోట్‌తో పనిచేసే లైఫ్‌ బోట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి ప్రాంతంతో కూడిన ఈ రీజనల్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహణ బాధ్యతను కాకినాడ కోస్ట్‌గార్డు స్టేషన్‌కు అప్పగించారని కమాండెంట్‌ టీఆర్‌కే రావు చెప్పారు. ఇందులో ఐసీజీఎస్‌ సముద్ర పహెరెదార్‌, ఐసీజీఎస్‌ విగ్రహ, ఐసీజీఎస్‌ కనకలత బారువా, ఐసీజీఎస్‌ ప్రియదర్శిని, ఛార్లీ నౌకలు పాల్గొన్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని