చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక శ్రీరామనవమి

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టిన తీరుకు ఉదాహరణగా శ్రీరామనవమి నిలుస్తుందని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

Published : 30 Mar 2023 05:37 IST

శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌, ముఖ్యమంత్రి

ఈనాడు, అమరావతి: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టిన తీరుకు ఉదాహరణగా శ్రీరామనవమి నిలుస్తుందని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మాన్ని పాటిస్తూ దయాగుణంతో మనమంతా జీవితంలో ముందుకు వెళ్లేందుకు శ్రీరాముడు మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని, వారి దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

రాముడి బాట అందరికీ అనుసరణీయం: చంద్రబాబు 

ధర్మం, సేవాభావం వంటి సద్గుణాలతో కూడిన రాముడి బాట అందరికీ అనుసరణీయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి పాలించిన వారే నిజమైన పాలకులనేది శ్రీరాముడి చరితం మనకు చాటి చెబుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని