Vande Bharat Express: 8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. వందేభారత్ టైమింగ్స్ ఇలా...
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తోంది.
గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తోంది. ఏప్రిల్ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్ నుంచి వందేభారత్ పరుగులు పెట్టనుంది. ఈ రైలు మంగళవారం మినహా ప్రతి రోజూ తిరుగుతుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం 8.30 గంటలు. ఛార్జీల వివరాలను రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో రైలును ప్రారంభిస్తున్నప్పటికీ ఆ రోజు ప్రయాణికులను అనుమతించబోరు. ఆ రోజు సికింద్రాబాద్‌లో 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతి 21.00 గంటలకు చేరుతుంది. గురువారం అధికారికంగా ప్రకటించిన ప్రయాణ సమయాలివి.
సికింద్రాబాద్-తిరుపతి (20701): సికింద్రాబాద్ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.
తిరుపతి-సికింద్రాబాద్(20702): తిరుపతి మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్ 23.45.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. తల్లి హత్య
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం