డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘చరక’ పురస్కారం
ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డిని చెన్నైకి చెందిన గిండీ రోటరీ క్లబ్ నిర్వాహకులు ప్రతిష్ఠాత్మక ‘చరక’ పురస్కారంతో సత్కరించారు.
ఈనాడు, హైదరాబాద్: ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డిని చెన్నైకి చెందిన గిండీ రోటరీ క్లబ్ నిర్వాహకులు ప్రతిష్ఠాత్మక ‘చరక’ పురస్కారంతో సత్కరించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు శ్రీరామ్, రమేశ్‌బాబు, అలెక్స్ పాల్ మేనన్, రాధా క్రిష్ తదితరులు డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా గిండీ రోటరీ క్లబ్ అధ్యక్షుడు రమేశ్‌బాబు మాట్లాడుతూ.. వైద్యవృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తూ రోగులకు విశిష్ట సేవలు అందిస్తున్న డా.నాగేశ్వరరెడ్డికి ఈ పురస్కారం ప్రదానం చేయడం గర్వకారణంగా ఉందన్నారు. డా.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గిండీ రోటరీ క్లబ్ 3 దశాబ్దాలుగా వ్యాధుల నివారణే లక్ష్యంగా పోరాడుతోందన్నారు. స్వచ్ఛమైన తాగునీరు, తల్లి ఆరోగ్య పరిరక్షణ అంశాల్లో అసాధారణ సేవలందిస్తోందని, ఈ క్లబ్ ప్రతినిధుల ద్వారా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను