వైఎస్సార్ కల్యాణమస్తు దరఖాస్తు గడువు కుదింపు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, భవన నిర్మాణ కార్మికులు, దివ్యాంగ యువతుల వివాహాలకు ఇచ్చే వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు దరఖాస్తు గడువును ప్రభుత్వం కుదించింది.
60 రోజుల నుంచి 30కి తగ్గింపు
షాదీ తోఫాకూ వర్తించనున్న నిబంధన
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, భవన నిర్మాణ కార్మికులు, దివ్యాంగ యువతుల వివాహాలకు ఇచ్చే వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు దరఖాస్తు గడువును ప్రభుత్వం కుదించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు వివాహమైన తర్వాత 60 రోజుల వరకు గడువిస్తుండగా తాజాగా దాన్ని 30 రోజులకు కుదించింది. ఈ నెల 6వ తేదీనే సాంఘిక సంక్షేమశాఖ ఈ ఉత్తర్వులను విడుదల చేసినా అంతర్గతంగా మాత్రమే సంబంధిత శాఖలకు పంపింది. చాలా గ్రామ, వార్డు సచివాలయాలకు మాత్రం ఆ సమాచారం చేరలేదు. నాలుగు రోజుల క్రితమే సదరు గ్రూపుల్లో అధికారులు పోస్ట్ చేసినట్లు క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ అధికారులు చెబుతున్నారు. సదరు ఉత్తర్వుల్లోనూ ఆ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో అధికారులు స్పష్టం చేయలేదని వాపోతున్నారు. దీంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో వివాహం చేసుకున్న కొంతమంది.. దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్తుంటే అధికారులు గడువు ముగిసినట్లు చెబుతున్నారని వాపోతున్నారు. ఈ రెండు పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని ప్రతి మూడు నెలలకొకసారి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం గతేడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి మొదటి విడతగా ఫిబ్రవరిలో ఆర్థికసాయం అందించింది. అన్ని వర్గాలకు చెందిన 4,536 మందికి కలిపి రూ.38.18 కోట్లు విడుదల చేసింది. పథకానికి అర్హులైన వర్గాల్లో ఏడాదికి సుమారు 90 వేల వివాహాలు జరుగుతాయని 2019లో అధికారులు అంచనా వేశారు. ఆ ప్రకారం చూస్తే మొదటి త్రైమాసికంలో లబ్ధిదారుల సంఖ్య నామమాత్రమే. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో సగటున నెలకు 200-1,200 వరకు మైనారిటీలకు సాయం అందేది. ఇప్పుడు వారి సంఖ్య బాగా తగ్గిందని ముస్లిం సంఘాల నేతలు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి