మార్గదర్శి మేనేజర్లకు ముందస్తు బెయిలు మంజూరు

మార్గదర్శి’ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌లకు ముందస్తు బెయిలు మంజూరైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో ఏలూరులోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ కార్యాలయంలో సీఐడీ అధికారులు సోదాలు చేసి, బ్రాంచి మేనేజర్‌ గుండపనేని వెంకట రామ్‌ప్రసాద్‌, డిప్యూటీ మేనేజర్‌ కె.లక్ష్మణమూర్తిపై కేసులు నమోదు చేశారు.

Published : 31 Mar 2023 04:29 IST

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ‘మార్గదర్శి’ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌లకు ముందస్తు బెయిలు మంజూరైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో ఏలూరులోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ కార్యాలయంలో సీఐడీ అధికారులు సోదాలు చేసి, బ్రాంచి మేనేజర్‌ గుండపనేని వెంకట రామ్‌ప్రసాద్‌, డిప్యూటీ మేనేజర్‌ కె.లక్ష్మణమూర్తిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కోర్టును ఆశ్రయించగా ఏలూరు జిల్లాకోర్టు న్యాయమూర్తి గురువారం ఇద్దరికీ ముందస్తు బెయిలు మంజూరు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు