నేడు మన్యం బంద్‌

బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు శాసనసభలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రంలోని మన్యం ప్రాంతంలో బంద్‌ నిర్వహించాలని వివిధ గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి.

Published : 31 Mar 2023 04:46 IST

బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే తీర్మానానికి వ్యతిరేకంగా గిరిజనుల పిలుపు

ఎటపాక, న్యూస్‌టుడే: బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు శాసనసభలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రంలోని మన్యం ప్రాంతంలో బంద్‌ నిర్వహించాలని వివిధ గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ విజయవంతం చేయాలని కోరుతూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. ఎటపాక, మేడువాయి, లక్ష్మీపురం, రాయనపేట, చోడవరం, గుండాల, నెల్లిపాక, తోటపల్లి, నల్లకుంట, బాసవాగు మీదుగా మురుమూరు వరకు ర్యాలీ జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ర్యాలీలో శ్రీను, వెంకటేశ్వర్లు, ధారయ్య, అనిల్‌, రాము తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని