ప్రభుత్వ లాంఛనాలతో యర్రా అంత్యక్రియలు

రాజ్యసభ మాజీ సభ్యుడు, రాష్ట్ర మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరులో గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

Published : 31 Mar 2023 04:53 IST

ఉప్పులూరు (ఉండి), న్యూస్‌టుడే: రాజ్యసభ మాజీ సభ్యుడు, రాష్ట్ర మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరులో గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఉప్పులూరులోని యర్రా భౌతికకాయానికి తొలుత మంత్రి నివాళులర్పించారు. డీసీసీబీ ఛైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌ తదితరులు నారాయణస్వామి కుమారులు నవీన్‌, సూర్యచంద్రరావులను పరామర్శించారు. ఎమ్మెల్యేలు రామరాజు, రామానాయుడు, తెలుగుదేశం పార్టీ జోన్‌ టూ పరిశీలకుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి చినరాజప్ప తదితరులు భౌతికకాయంపై తెదేపా పతాకాన్ని ఉంచి నివాళులర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని