ఆరో తరగతి చిన్నారి.. పది పరీక్షలకు సన్నద్ధం

పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు.. కాకినాడకు చెందిన ముప్పాళ్ల హేమశ్రీ ఆరో తరగతి చదువుతుండగానే పదోతరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది.

Published : 01 Apr 2023 04:42 IST

కాకినాడ (వెంకట్‌నగర్‌), న్యూస్‌టుడే: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు.. కాకినాడకు చెందిన ముప్పాళ్ల హేమశ్రీ ఆరో తరగతి చదువుతుండగానే పదోతరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది. కాకినాడ గాంధీనగర్‌లోని మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో హేమశ్రీ ఆరోతరగతి చదువుతోంది. ఈమె తెలివితేటల గురించి ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. మార్చి 27న అమరావతిలోని సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ హేమశ్రీ ప్రతిభను పరీక్షించారు. 20 నిమిషాలకు పైగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థిని ఐక్యూను ప్రశంసించి, పదోతరగతి పరీక్షలు రాసేందుకు సిఫార్సు చేశారు. శుక్రవారం పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్‌ జి.దుర్గాప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో హేమశ్రీను అభినందించి హాల్‌టికెట్‌ను అందజేశారు. హేమశ్రీ తల్లి మణి గృహిణి, తండ్రి సురేష్‌ ప్రైవేటు ఉద్యోగి. చిన్నప్పటి నుంచి తెలివితేటలు ఎక్కువని, 2022 అంతర్జాతీయ స్థాయిలో భగవద్గీత పోటీల్లో బంగారుపతకం, సంస్కృత పోటీల్లో లెవెల్‌-1లో రాష్ట్రంలో మొదటిస్థానం, వేమన శతక రచన అవార్డు, పదేళ్లలోపే అనేక బహుమతులు సాధించినట్లు తల్లి మణి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు