అది గిరిజనుల గొంతుకోసే తీర్మానం!
బోయ, వాల్మీకులు, బొంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేలా శాసనసభలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో శుక్రవారం మన్యం ప్రాంతంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది.
ఎస్టీ జాబితాలో ఇతర కులాల్ని చేర్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
అధికార పార్టీ ఎస్టీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి
గిరిజన సంఘాల డిమాండ్
మన్యం బంద్ విజయవంతం
ఈనాడు డిజిటల్ - అనకాపల్లి, న్యూస్‌టుడే యంత్రాంగం
బోయ, వాల్మీకులు, బొంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేలా శాసనసభలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో శుక్రవారం మన్యం ప్రాంతంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గిరిజన సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అది గిరిజనుల గొంతుకోసే తీర్మానమని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీ జాతిని అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నా అధికారపార్టీలోని ఎస్టీ శాసనసభ్యులు ఎందుకు నోరుమెదపడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని, లేకుంటే గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. తీర్మానం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
మన్యం బంద్‌కు ఆదివాసీ ఐకాస పిలుపునివ్వగా గిరిజన సంఘం, తెలుగుదేశం, సీపీఎం, భాజపా, జనసేన పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు కొంత మంది విధులకు సెలవులు పెట్టుకుని బంద్‌కు సహకారాన్ని అందించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్టీసీ సర్వీసులు రద్దు చేయడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.
ఆందోళనలో పాల్గొన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి
పాడేరులో నివాసం ఉంటున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి బాబూరావునాయుడు ఆందోళన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. బంద్ జరుగుతున్న సమయంలో ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ పెదబయలు మండల పర్యటనకు బయలుదేరడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఆయన వాహనాన్ని ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు అడ్డగించారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న బాబూరావునాయుడు పీవో వాహనానికి అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. ఆదివాసీ ఐకాస కన్వీనర్ రామారావుదొర, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శేషాద్రి, గిరిజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రామారావు బంద్‌ను పర్యవేక్షించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో రాస్తారోకో
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో జాతీయ రహదారి మీదుగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సీదరపు అప్పారావు, సభ్యులు ర్యాలీ చేశారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని సంఘీభావం తెలిపారు. గిరిజనులకు అన్యాయం జరుగుతున్నా ఉపముఖ్యమంత్రి రాజన్నదొర చోద్యం చూస్తున్నారని ఆమె విమర్శించారు. సాలూరు మండలంలోని దత్తివలస వద్ద ప్రధాన రహదారిపై గిరిజనులు బైఠాయించి రాస్తారోకో చేశారు.
వైకాపా ప్రజాప్రతినిధుల మద్దతు
ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైకాపాకు చెందిన చింతపల్లి, గూడెంకొత్తవీధి ఎంపీపీలు కోరాబు అనూషాదేవి, బోయిన కుమారి, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య తెలిపారు. ఆదివాసీ జేఏసీ, గిరిజన సంఘం, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చింతపల్లిలో నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొన్నారు. తీర్మానాన్ని రద్దు చేయాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
Crime News
పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్