శ్రీవారికి మార్చిలో రూ.120 కోట్ల హుండీ ఆదాయం

శ్రీవారికి మార్చిలో రూ.120.29 కోట్ల హుండీ ఆదాయం లభించింది. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి హుండీ ఆదాయం ప్రతినెలా రూ.వంద కోట్లు దాటుతోంది.

Updated : 01 Apr 2023 06:29 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారికి మార్చిలో రూ.120.29 కోట్ల హుండీ ఆదాయం లభించింది. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి హుండీ ఆదాయం ప్రతినెలా రూ.వంద కోట్లు దాటుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకల ద్వారా తితిదేకు రూ.1,520.29 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత కొన్నాళ్లుగా భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులు సమర్పిస్తున్నారు. దీంతో తితిదేకు మార్చి 31వ తేదీకి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా ఆదాయం సమకూరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని