జగన్‌ సర్కారును బంగాళాఖాతంలో కలపాలి

అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైకాపాను బంగాళాఖాతంలో కలపాలని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌  ఆరె శివారెడ్డి తెలిపారు.

Updated : 01 Apr 2023 05:24 IST

అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ ఆరె శివారెడ్డి

ఈనాడు, అమరావతి: అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైకాపాను బంగాళాఖాతంలో కలపాలని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌  ఆరె శివారెడ్డి తెలిపారు. మందడంలో శుక్రవారం జరిగిన 1200వ రోజు సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈసారి ప్రభుత్వం మారకపోతే రాజధాని అమరావతి కాలగర్భంలో కలిసిపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలందరిలో అవగాహన కల్పించాలి’ పేర్కొన్నారు.


ప్రజారాజధానిగా అమరావతి గెలుస్తుంది: లోకేశ్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: ప్రజారాజధానిగా అమరావతి గెలుస్తుందని, చరిత్రలో నిలుస్తుందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఆయన పేరుతో తెదేపా మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన విడుదలైంది. ‘తరతరాలుగా జీవనోపాధికి ఆధారమైన భూముల్ని ప్రజా రాజధాని అమరావతి కోసం ఇచ్చిన త్యాగం వృథా పోదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో చేపట్టిన అలుపెరగని ఉద్యమానిదే అంతిమ విజయం. ఎన్నెన్నో దాడులను ఎదురొడ్డి 1200 రోజులుగా పోరాడుతున్న అందరికీ ఉద్యమాభివందనాలు’ అని తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని