పాత్రికేయులు సమాజహితానికి పనిచేయాలి

పాత్రికేయుల వృత్తి నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా డిప్లొమా కోర్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.

Published : 01 Apr 2023 05:16 IST

మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం(దేవీచౌక్‌), న్యూస్‌టుడే: పాత్రికేయుల వృత్తి నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా డిప్లొమా కోర్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిజంలో డిప్లొమా కోర్సుకు సంబంధించిన ప్రకటనను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం పాత్రికేయులు పనిచేయాలని, వాస్తవాలు వెలికితీయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. కోర్సు తరగతులు ఆన్‌లైన్‌లో ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో 8,699 మంది జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డులు అందజేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కోర్సుకోసం నాగార్జున విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు