నడక మార్గాల్లో దివ్యదర్శన టోకెన్ల జారీ
తిరుమల నడక మార్గాల్లో దివ్యదర్శన టోకెన్ల జారీని తితిదే పునఃప్రారంభించింది. కొవిడ్ నేపథ్యంలో మూడేళ్లుగా వీటిని నిలిపివేసిన తితిదే శనివారం ఉదయం ప్రయోగాత్మకంగా చేపట్టింది.
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల నడక మార్గాల్లో దివ్యదర్శన టోకెన్ల జారీని తితిదే పునఃప్రారంభించింది. కొవిడ్ నేపథ్యంలో మూడేళ్లుగా వీటిని నిలిపివేసిన తితిదే శనివారం ఉదయం ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ మేరకు అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం వద్ద 10 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 5 వేల టోకెన్లు ఇచ్చింది. వేకువజామున 5 గంటల నుంచే ఇవ్వడంతో ఉదయం 9.30 గంటల వరకు శనివారం కోటా పూర్తయింది. దీంతో ఆదివారం ఇవ్వాల్సిన దాదాపు 3 వేల టోకెన్లనూ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం మిగతా కోటా పూర్తయితే సోమవారం నాటివీ జారీచేసే అవకాశముంది.
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంది. శనివారం సాయంత్రానికి ధర్మదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి నారాయణగిరిలోని షెడ్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే అధికారులు తెలిపారు. శ్రీవారిని శుక్రవారం 61,425 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.01 కోట్ల హుండీ కానుకలు లభించాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
suez canal: సూయిజ్ కాలువలో ఆగిపోయిన చమురు ట్యాంకర్
-
World News
china: తియానన్మెన్ స్క్వేర్ వద్దకు ప్రవేశాలపై ఆంక్షలు
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Crime News
Suicide: నలుగురు పిల్లల్ని చంపేసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
Siddharth: ‘టక్కర్’తో నా కల నెరవేరింది.. ఆయనకు రుణపడి ఉంటా: సిద్ధార్థ్