Vande Bharat Express: సికింద్రాబాద్‌- తిరుపతి వందేభారత్‌ షెడ్యూల్‌ ఇదే..

సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పూర్తి సమాచారాన్ని ద.మ.రైల్వే ప్రకటించింది.

Updated : 02 Apr 2023 07:21 IST

రాష్ట్రంలో గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో ఆగనున్న రైలు

తిరుపతి(రైల్వే), న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పూర్తి సమాచారాన్ని ద.మ.రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ రైలును ఈనెల 8న ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్‌లో ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో రైలు నంబర్లు, సమయాలు, నిలిచే స్టేషన్ల వివరాలను ద.మ.రైల్వే విడుదల చేసింది.

సికింద్రాబాద్‌- తిరుపతి (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి నల్గొండ(07:19), గుంటూరు(9:45), ఒంగోలు(11:09), నెల్లూరు(12:29)  మీదుగా తిరుపతికి మధ్యాహ్నం 2:30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి- సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి నెల్లూరు (5:20), ఒంగోలు (6:30), గుంటూరు (7:45), నల్గొండ (10:10) మీదుగా సికింద్రాబాద్‌కు రాత్రి 11:45 గంటలకు చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు రైలు నడవనుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ రైలు ఈ నెల 9న ప్రారంభమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని