Medical Shops-AP: బోర్డులు ఉంటే పన్ను చెల్లించాల్సిందే

విశాఖ నగరంలో మందుల దుకాణాల నిర్వాహకులకు జీవీఎంసీ ప్రణాళికా విభాగం అధికారులు షాక్‌ ఇచ్చారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసుకున్న బోర్డులకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించాలని ఇచ్చిన నోటీసులతో అవాక్కవుతున్నారు.

Updated : 02 Apr 2023 10:01 IST

మందుల దుకాణాల వెంటపడుతున్నజీవీఎంసీ సిబ్బంది

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగరంలో మందుల దుకాణాల నిర్వాహకులకు జీవీఎంసీ ప్రణాళికా విభాగం అధికారులు షాక్‌ ఇచ్చారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసుకున్న బోర్డులకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించాలని ఇచ్చిన నోటీసులతో అవాక్కవుతున్నారు. ‘డిస్‌ప్లే డివైస్‌ ట్యాక్స్‌’ పేరుతో వచ్చిన నోటీసులను చూసి కంగుతింటున్నారు. ఇలాంటివి అందుకోవడం ఇదే మొదటిసారని, 20, 30 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్న తమకు ఎప్పుడూ ఇలా రాలేదంటున్నారు. సాధారణంగా నగరపాలక, పురపాలక సంఘాలు వాణిజ్య, ఇతర దుకాణాల ప్రకటన బోర్డులు, గ్లో సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, ఆర్చ్‌లపైన పన్నులు విధిస్తాయి. మందుల దుకాణాలు అత్యవసర సేవల కిందకు రావడంతో వాటికి మినహాయింపు ఉంటుందని ఆ సంఘ నాయకులు పేర్కొంటున్నారు. గాజువాక, పెందుర్తి, సీతమ్మధార, చినగదిలి, మహారాణిపేట, గోపాలపట్నం, జ్ఞానాపురం, భీమిలి ప్రాంతాల్లోని అన్ని దుకాణాలకు జోన్ల వారీగా కొద్ది రోజుల క్రితం నోటీసులు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో పన్ను చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరో వైపు ఈ అంశంపై కొందరు జీవీఎంసీ కమిషనర్‌కు లీగల్‌ నోటీసులు పంపినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు