శ్మశానంలోనే కల్లం..!

తూర్పుగోదావరి జిల్లాలో రబీ సీజన్లో వేసిన మొక్కజొన్న చేతికందొచ్చింది. పొత్తులు ఆరబెట్టేందుకు అవసరమైన స్థలం దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు.

Published : 02 Apr 2023 03:47 IST

తూర్పుగోదావరి జిల్లాలో రబీ సీజన్లో వేసిన మొక్కజొన్న చేతికందొచ్చింది. పొత్తులు ఆరబెట్టేందుకు అవసరమైన స్థలం దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. సీతానగరం మండలం వంగలపూడి శ్మశానవాటికలోని సమాధుల మధ్యలోనే మొక్కజొన్న ఆరబెట్టుకుని అక్కడే రైతులు పడుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులు వచ్చి సరకు కొనుగోలు చేసేవరకు శ్మశానంలోనే సరకు భద్రపరుచుకుంటున్నారు. రైతుల ఫలసాయం కోసం అవసరమైన గోదాములు నిర్మాణాలు లేక అవస్థలు పడుతున్నారు.

న్యూస్‌టుడే, సీతానగరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు