అంతరించిపోతున్న కళలను బతికించుకుందాం

అంతరించిపోతున్న కళలను బతికించుకుందామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) అధ్యక్షుడు నూతి బాపు పేర్కొన్నారు.

Published : 02 Apr 2023 03:47 IST

విశాఖలో తెలుగు జానపద సంబరాలు

విశాఖపట్నం (మద్దిలపాలెం), న్యూస్‌టుడే : అంతరించిపోతున్న కళలను బతికించుకుందామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) అధ్యక్షుడు నూతి బాపు పేర్కొన్నారు. నాట్స్‌, గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ (గ్లో), శ్రీమాతా కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలోని పిఠాపురం కళాభారతి ఆడిటోరియంలో శనివారం ‘తెలుగు జానపద సంబరాలు’ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపు మాట్లాడుతూ.. కళలను బతికించుకోవాలనే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జానపద సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. నాట్స్‌ తెలుగు సంబరాల సమన్వయకర్త అప్పసాని శ్రీధర్‌ మాట్లాడుతూ.. అమెరికాలోని న్యూజెర్సీలో మే 26, 27 తేదీల్లో తెలుగు సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జముకు కళాకారుడు అసిరయ్య పాడిన జానపద గీతాలు, థింసా నృత్యం అలరించాయి. తెలుగు భాషా కోవిదుడు డాక్టర్‌ మీగడ రామలింగస్వామి, నాటకరంగ ప్రముఖులు ఎడ్ల గోపాలంను సన్మానించారు. విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ పెదవీర్రాజు, గ్లో సంస్థ కార్యదర్శి యార్లగడ్డ వెంకన్నచౌదరి, శ్రీమాత కళాపీఠం నిర్వాహకులు పల్లి నాగభూషణం, బీఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని