నిరసన తెలపడానికే రాయి విసిరారు..
భాజపా నేత సత్యకుమార్ కాన్వాయ్‌పై శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు సమీపంలో జరిగిన దాడి సంఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
సత్యకుమార్‌పై దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసులు
నిఘా విభాగం సమాచారం మేరకే బందోబస్తు ఏర్పాట్లు
గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడి
ఈనాడు, అమరావతి-గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: భాజపా నేత సత్యకుమార్ కాన్వాయ్‌పై శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు సమీపంలో జరిగిన దాడి సంఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి వెళుతున్న సత్యకుమార్, ఇతర నేతలు.. మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటుచేసిన శిబిరం వద్దకు చేరుకునేసరికి దాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భాజపా వారి కాన్వాయ్‌పై రాయితో దాడి చేసిన నితిన్‌ను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. సత్యకుమార్‌పై దాడి చేయాలనే ఉద్దేశంతో కాకుండా నిరసన తెలపాలని అతడు రాయి విసిరాడని తెలిపారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. సీఎంను దూషించిన కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఏఎస్పీ అనిల్ మాట్లాడారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు వైరల్ కావడంతో మూడు రాజధానుల శిబిరం వద్ద ఉత్కంఠ నెలకొన్నట్లు సమాచారం వచ్చిందని.. తాను, డీఎస్పీ పోతురాజు, పోలీసులు అక్కడికి చేరుకున్నామని తెలిపారు. అప్పటికే అక్కడికి వస్తున్న భాజపావారి వాహనాల ఎదురుగా రోడ్డుపైకి వచ్చి మూడు రాజధానుల శిబిరంలోని వారు బైఠాయించారని తెలిపారు. అప్పుడు జైఅమరావతి అన్న నినాదాలు వినిపించడంతో మూడు రాజధానులవారు స్పందించారని, దీంతో తోపులాట చోటుచేసుకుందని వివరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు రక్షణతో భాజపా నాయకులున్న కాన్వాయ్‌ను పంపించామన్నారు. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తి కాన్వాయ్‌లోని చివరి వాహనంపై రాయి విసిరారని, ఆయన్ను నితిన్‌గా గుర్తించామని తెలిపారు. దాడికి గురయిన కారులో సత్యకుమార్ లేరని వివరించారు. కాన్వాయ్‌లో భాజపా నేత సత్యకుమార్ ఉన్నట్లు తమకు తెలియదని అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు పోలీసు ఉన్నతాధికారులు సమాధానమిచ్చారు. భాజపా కార్యకర్త, చొక్కా చిరిగిన సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు. బాపట్ల ఎంపీపై ఫిర్యాదు చేయలేదని, వైకాపా వాళ్లని పేర్కొన్నారని తెలిపారు. వైకాపాతో సంబంధం లేకుండా సంఘటనలో ఎంతమంది పాత్ర ఉంటే అందరిపైనా చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఈ దాడికి జగన్ పథక రచనతో పాటు పోలీసుల సహకారమూ ఉందన్న సత్యకుమార్ ఆరోపణలపై ఏఎస్పీ స్పందించారు. పోలీసులెలా సంరక్షించి కాన్వాయ్‌లో పంపించారనేది అన్ని మీడియాల్లో చూశారని వెల్లడించారు. దాడి చేయాలని మూడు రాజధానుల శిబిరం వారు పథకం రూపొందించుకున్నారా? అని ప్రశ్నించగా.. ఇది విచారణలో తేలుతుందని, తమ ఆలోచన హైకోర్టుకు వెళ్లే మార్గంలో ఎలాంటి సంఘటనలు జరగకూడదేనని వెల్లడించారు. ముందుగానే మూడు రాజధానుల శిబిరంలోని వారిని పంపించేస్తే ఈ సంఘటన జరిగేది కాదు కదా? అన్న విలేకరుల ప్రశ్నకు డీఎస్పీ పోతురాజు సమాధానమిచ్చారు. ‘భాజపావాళ్లు ముందు మందడం శిబిరానికి వెళ్లారు. అక్కడినుంచి తుళ్లూరు మీదుగా ఆదినారాయణరెడ్డితో పాటు ఇతరుల వాహనాలు వెళ్లిపోయాయి. తుళ్లూరులో భాజపా కార్యకర్తను పరామర్శించడానికి సత్యకుమార్ వెళ్లి అక్కడినుంచి విజయవాడ వెళ్లటానికి రివర్స్‌లో సీడ్‌యాక్సెస్ రోడ్డు వైపు వచ్చారు. కాన్వాయ్ వెనక్కురావడంతో మా సిబ్బందినుంచి సమాచారం రాగానే వెళ్లేప్పటికి ఈ సంఘటన చోటుచేసుకుంది’ అని వివరించారు. భాజపా జాతీయస్థాయి నాయకుల పర్యటన సమయంలో నిఘా విభాగమిచ్చే సమాచారంబట్టే బందోబస్తు ఏర్పాటు చేశామని, కాకపోతే వాళ్లు మార్గం మార్చుకోవడంతో ఇలా జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై మధ్యాహ్నం ఫిర్యాదు రావడంతో తొలుత కేసు నమోదు చేశామని, ఆ తర్వాతి పరిణామాలపై తదనుగుణంగా చర్యలు తీసుకున్నామని డీఎస్పీ వివరించారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యల వీడియోలను మీకు పంపుతానని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘మూడు రాజధానుల శిబిరం మీదుగా మేము వెళ్లేటప్పుడు ఎవరూ లేరు? మళ్లీ అటుగా వస్తున్నామని తెలుసుకొని దాడికి వచ్చారని భాజపావారు ఆరోపిస్తున్నారని ప్రశ్నించగా.. అది వాస్తవం కాదని, సీసీ కెమెరాలున్నాయని.. కావాలంటే ఫుటేజీలు పరిశీలించుకోవచ్చని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు