లీజుకిచ్చిన ఆస్తుల్ని వెనక్కి తీసుకుంటాం

ఆప్కో ఆస్తుల్ని విక్రయించబోమని, లీజుకు ఇచ్చిన వాటినీ చట్టప్రకారం వెనక్కి తీసుకుంటామని ఆప్కో ఛైర్మన్‌ గంజి చిరంజీవి అన్నారు.

Published : 02 Apr 2023 04:47 IST

ఆప్కో ఛైర్మన్‌ గంజి చిరంజీవి

ఈనాడు డిజిటల్‌-అమరావతి, న్యూస్‌టుడే-మంగళగిరి: ఆప్కో ఆస్తుల్ని విక్రయించబోమని, లీజుకు ఇచ్చిన వాటినీ చట్టప్రకారం వెనక్కి తీసుకుంటామని ఆప్కో ఛైర్మన్‌ గంజి చిరంజీవి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి చేనేత సహకార సంఘాలకు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేలా నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం చేనేత కార్మిక కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.12,500 నుంచి రూ.25 వేలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆప్కో సర్వసభ్య సమావేశాన్ని మంగళగిరిలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నూలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. చేనేత పితామహులు దివంగత ప్రగడ కోటయ్య, మాచాని సోమప్ప, మిడుతు అప్పయ్య జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఆప్కో ఎండీ నాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు రుణంపై చేనేత వస్త్రాలను అందించే పథకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని