కోడికత్తి కేసు విచారిస్తున్న న్యాయాధికారి కడపకు బదిలీ

మూడు జిల్లాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తులను (పీడీజే) నియమిస్తూ మంగళవారం హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 19 Apr 2023 09:34 IST

మూడు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

ఈనాడు, అమరావతి: మూడు జిల్లాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తులను (పీడీజే) నియమిస్తూ మంగళవారం హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పలువురు అదనపు జిల్లా జడ్జిలను (ఏడీజే) కొత్త స్థానాలకు బదిలీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌)గా పనిచేస్తున్న గంధం సునీత.. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)గా నియమితులయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌)గా పనిచేస్తున్న ఆలపాటి గిరిధర్‌ విశాఖపట్నం పీడీజేగా బదిలీ అయ్యారు. విజయవాడలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తిని కడప జిల్లా పీడీజేగా నియమించారు. విశాఖ పీడీజేగా పనిచేస్తున్న జి.గోపిని విశాఖలోని ఏపీ వ్యాట్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా బదిలీ చేశారు. అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో హత్యాయత్నం కేసును విచారిస్తున్న విజయవాడ ఎంఎస్‌జే కోర్టు/రెండో ఏడీజే న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయమూర్తి కడపకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడ మూడో ఏడీజే కోర్టు జడ్జి ఎ.సత్యానంద్‌ వచ్చారు.

* విశాఖలోని ఏపీ వ్యాట్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జి.శ్రీదేవిని అనంతపురం ఫ్యామిలీ కోర్టు జడ్జిగా, అనంతపురం ఫ్యామిలీ కోర్టు జడ్జి తిరుమలరావును గుంటూరులోని ఇండస్ట్రీయల్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా, అనంతపురం మొదటి ఏడీజే ఎస్‌.రమేశ్‌ చిత్తూరు మొదటి ఏడీజేగా, అనంతపురం ఆరో ఏడీజే జి.కబర్ధి నెల్లూరు మెదటి ఏడీజేగా, నెల్లూరు మొదటి ఏడీజే సి.సత్యవాణి నెల్లూరు రెండో ఏడీజే/ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా, రాజమహేంద్రవరం మొదటి ఏడీజే కె.సునీత విజయవాడ కోపరేటివ్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా బదిలీ చేశారు.

* ప్రకాశం జిల్లా మార్కాపురం ఆరో ఏడీజే రాజావెంకటాద్రి ఒంగోలు ఏడో ఏడీజేగా, ఒంగోలు 7వ ఏడీజే ఆర్‌.శరత్‌బాబు గుంటూరు నాలుగో ఏడీజేగా, గుంటూరు నాలుగో ఏడీజే జి.రామ్‌గోపాల్‌ ఏలూరు మొదటి ఏడీజేగా, ఏలూరు మొదటి ఏడీజే పి.మంగకుమారి ఏలూరు రెండో ఏడీజేగా, కడప జిల్లా రాజంపేట మూడో ఏడీజే ఆర్‌వీవీఎస్‌ మురళీకృష్ణ విశాఖ మూడో ఏడీజేగా, విశాఖ మూడో ఏడీజే ఎం.తిరుమలరావు విశాఖ ఎంఎస్‌జే/మొదటి ఏడీజేగా, విశాఖ సీబీఐ కేసుల ప్రధాన ప్రత్యేక జడ్జి సత్యవెంకట హిమబిందు విజయవాడ మూడో ఏడీజేగా బదిలీ అయ్యారు.

* విజయవాడ మూడో అదనపు ఏడీజే ఎ.సత్యానంద్‌ విజయవాడ ఎంఎస్‌జే/రెండో ఏడీజేగా, చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో ఏడీజే పి.భాస్కర్‌రావు శ్రీకాకుళం మూడో ఏడీజేగా, శ్రీకాకుళం మూడో ఏడీజే కె.శ్రీదేవి.. శ్రీకాకుళం మెదటి ఏడీజేగా, శ్రీకాకుళం మొదటి ఏడీజే టి.వెంకటేశ్వర్లు విజయవాడ నాలుగో ఏడీజేగా, చిత్తూరు 9వ ఏడీజే ఎస్‌.శ్రీనివాసరావు విశాఖ 7వ ఏడీజేగా, నెల్లూరు 5వ ఏడీజే ఎం.మాధురి రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టు జడ్జిగా, రాజమహేంద్రవరం 9వ ఏడీజే సీహెచ్‌.రాజగోపాలరావు గుంటూరు మొదటి ఏడీజేగా, గుడివాడ 11వ ఏడీజే జి.రజని విజయనగరం మొదటి ఏడీజేగా, విజయనగరం మొదటి ఏడీజే కె.రాధారత్నం విశాఖ ఫ్యామిలీ కోర్టు జడ్జిగా, విశాఖ జిల్లా అనకాపల్లి 10వ ఏడీజే ఎం.ఫణికుమార్‌ శ్రీకాకుళం 4వ ఏడీజేగా బదిలీ అయ్యారు. ఏలూరు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి డి.శ్రీనివాసులు పదోన్నతిపై అనంతపురం 8వ ఏడీజేగా నియమితులయ్యారు.

* మే 1లోపు కొత్తస్థానాల్లో చేరాలని స్పష్టంచేశారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) లక్ష్మణరావు మంగళవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని