‘ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా... నేనూ ఎస్సీనే’: యువకుడిపై డిప్యూటీ సీఎం ఆగ్రహం

ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా.. నేనూ ఎస్సీనే.. జాగ్రత్త.. ఏమనుకుంటున్నావ్‌ అంటూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తనను గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరిన ఓ యువకుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 19 Apr 2023 11:07 IST

వెదురుకుప్పం, న్యూస్‌టుడే: ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా.. నేనూ ఎస్సీనే.. జాగ్రత్త.. ఏమనుకుంటున్నావ్‌ అంటూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తనను గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరిన ఓ యువకుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం కురివికుప్పంలో ఉపముఖ్యమంత్రి గడపగడపకు మన ప్రభుత్వం పేరిట మంగళవారం ఇంటింటి పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు శంకర్‌ మాట్లాడుతూ.. తమ కాలనీకి బస్సు సౌకర్యం, శ్మశాన వాటిక, దారులు బాగుచేయాలని, పశువుల బాట, తాగునీటి వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. దాంతో 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్యలు లేవా అంటూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఊగిపోయారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై లోకేష్‌కు సూచించారు. తహసీల్దారును పిలిచి కాలనీ వాసుల కోసం శ్మశానాన్ని సర్వే చేయించి రాళ్లు నాటించాలని చెప్పి ముందుకు సాగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని