Summer-fog: ఏప్రిల్‌.. ఎండలు మండు.. పొగమంచూ ఉండు!

‘ఏప్రిల్‌ ఎండలు మెండు’ అని చదువుకున్నాం. కానీ.. బాపట్ల జిల్లాలోని గ్రామాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకోవడం ప్రజల్ని ఆశ్చర్యపరుస్తోంది.

Updated : 19 Apr 2023 06:53 IST

‘ఏప్రిల్‌ ఎండలు మెండు’ అని చదువుకున్నాం. కానీ.. బాపట్ల జిల్లాలోని గ్రామాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకోవడం ప్రజల్ని ఆశ్చర్యపరుస్తోంది. చీరాల, అద్దంకి, చినగంజాం, మార్టూరు, యద్దనపూడిలో మునుపెన్నడు లేనివిధంగా ఈ నెలలో ఉదయం 8 గంటల వరకు పొగమంచు కనిపిస్తోంది. దీంతో మంగళవారం ఉప్పు మడుల్లోని తీతలు, మోతల పనులు ఆలస్యంగా మొదలుపెట్టారు. పొగమంచు ధాటికి రోడ్లపై వాహనాలూ నెమ్మదిగా వెళ్తూ కనిపించాయి. ఉదయం చలి వణికిస్తూ.. మధ్యాహ్నమయ్యే సరికి సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు.

న్యూస్‌టుడే, చినగంజాం, మార్టూరు, చీరాల, అద్దంకి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని