AP SSC Results: ఏపీ ‘పది’ పరీక్షల ఫలితాలు నేడు

పదోతరగతి పరీక్షల ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Updated : 06 May 2023 06:39 IST

విడుదల చేయనున్న మంత్రి బొత్స

ఈనాడు, అమరావతి: పదోతరగతి పరీక్షల ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరగగా..18 రోజుల్లోనే ఫలితాలను ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. వీరిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807మంది ఉన్నారు. ఫలితాలను www.eenadu.net, pratibha.eenadu.net, eenadupratibha.net లో పొందవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని