ECI: ఏపీ, తెలంగాణ సహా 9 రాష్ట్రాల ఎన్నికలకు ఈసీఐ సమాయత్తం

కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

Updated : 10 May 2023 08:29 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎలక్షన్‌ సింబల్స్‌ (రిజర్వేషన్‌ అండ్‌ అలాట్‌మెంట్‌) ఆర్డర్‌ 1968లోని పేరా 10-బిని అనుసరించి 2023-24 సంవత్సరాల్లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఉమ్మడి గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు జులై 17 తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 12 తర్వాత, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 17 తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో, ఏపీ అసెంబ్లీ గడువు 2024 జూన్‌ 11తో, లోక్‌సభ గడువు 2024 జూన్‌ 16తో ముగియనున్నట్లు  వెల్లడించింది. ఒకవేళ ఏదైనా అసెంబ్లీ గడువు తేదీ కంటే ముందే రద్దయితే, ఆ రోజు నుంచి నోటిఫికేషన్‌ జారీచేసే నాటికి అయిదురోజుల ముందు వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని