Botsa Satyanarayana: అప్పులు చేసి ప్రజలకే ఇస్తున్నాం: మంత్రి బొత్స
‘అప్పులు చేస్తున్నాం.. అంటున్నారు. అప్పులు చేసి ప్రజలకు ఇస్తున్నాం. గత ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. కానీ ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
చీపురుపల్లి, న్యూస్‌టుడే: ‘అప్పులు చేస్తున్నాం.. అంటున్నారు. అప్పులు చేసి ప్రజలకు ఇస్తున్నాం. గత ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. కానీ ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లిలోని జి.అగ్రహారంలో నూతనంగా నిర్మించిన కేజీబీవీ జూనియర్ కళాశాల భవన సముదాయం, గ్రామ సచివాలయ భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై ప్రతిపక్షాలు లేనిపోని ప్రకటనలు చేయడం విచారంగా ఉందని, ముఖ్యమంత్రిని చులకనగా మాట్లాడడం తప్ప వాళ్లకు ఇంకో పని లేదని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలకు అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..