సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర ప్రమాణం నేడు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు.

Updated : 19 May 2023 05:26 IST

సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ కూడా..
వీరిద్దరి నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ

ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వీరితో ప్రమాణం చేయించనున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 16న కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. శుక్రవారం సుప్రీంకోర్టులో ప్రమాణస్వీకారం జరగనుంది. కొలీజియం సిఫారసు చేసిన 48 గంటల్లోనే నియామకాలు చేపట్టడం విశేషం. వీరిద్దరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని