సీఎం జగన్‌ అనుచరులం అంటూ మోసం

ముఖ్యమంత్రి జగన్‌ అనుచరులం అని చెప్పుకొంటూ కొందరు వ్యక్తులు ఏపీ, తెలంగాణల్లో పేద క్రైస్తవులు, పాస్టర్లను మోసం చేశారని నేషనల్‌ క్రిస్టియన్‌ బోర్డు(ఎన్‌సీబీ) జాతీయ అధ్యక్షుడు జాన్‌ మాస్క్‌ ఆరోపించారు.

Updated : 21 May 2023 05:56 IST

పేద క్రైస్తవులను ముంచిన రెండు సంస్థలు
ఎన్‌సీబీ జాతీయ అధ్యక్షుడు జాన్‌ మాస్క్‌

విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్‌), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ అనుచరులం అని చెప్పుకొంటూ కొందరు వ్యక్తులు ఏపీ, తెలంగాణల్లో పేద క్రైస్తవులు, పాస్టర్లను మోసం చేశారని నేషనల్‌ క్రిస్టియన్‌ బోర్డు(ఎన్‌సీబీ) జాతీయ అధ్యక్షుడు జాన్‌ మాస్క్‌ ఆరోపించారు. మోసపోయిన సుమారు 25 మంది బాధిత పాస్టర్లు, క్రైస్తవులతో కలిసి విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గుడ్‌ షెఫర్డ్‌ సంస్థ ఫౌండేషన్‌, ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు కలిసి సీఎం పేరు చెప్పి, కొంత మొత్తం పెట్టుబడి పెడితే తిరిగి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని నమ్మించారన్నారు. పాస్టర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని.. రూ.10 వేలు కడితే రూ.10 లక్షలు ఇస్తామని రూ.కోట్లలో వసూలు చేశారన్నారు. నగదు డిపాజిట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ తమిళనాడులో 5 సెంట్ల స్థలం ఇస్తామని రూ.5 లక్షల చొప్పున వసూలు చేశారన్నారు. ప్రస్తుతం వారు మొహం చాటేయడంతో బాధితులు ప్రశ్నించారని, దానికి సరైన రీతిలో ఆయా ఫౌండేషన్‌ల నిర్వాహకులు స్పందించడం లేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు