గుట్టుచప్పుడు కాకుండా భూమిపూజ

కర్నూలులో రూ.కోట్ల విలువైన ఆగ్రోస్‌ స్థలంలో వైకాపా కార్యాలయం నిర్మాణానికి గుట్టుచప్పుడు కాకుండా భూమిపూజ నిర్వహించారు.

Published : 21 May 2023 03:43 IST

రూ.కోట్ల విలువైన ఆగ్రోస్‌ స్థలంలో వైకాపా కార్యాలయం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలులో రూ.కోట్ల విలువైన ఆగ్రోస్‌ స్థలంలో వైకాపా కార్యాలయం నిర్మాణానికి గుట్టుచప్పుడు కాకుండా భూమిపూజ నిర్వహించారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు, నగరపాలక సంస్థ మేయర్‌ బీవై రామయ్య చేతుల మీదుగా శనివారం భూమిపూజ చేశారు. అధికారపార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు మరెవరినీ పిలవకుండా.. మీడియా కళ్లుగప్పి భూమిపూజ చేశారు. బనగానపల్లిలో నారా లోకేశ్‌ పర్యటన ఉండటం.. కర్నూలులోని ఆసుపత్రిలో అవినాష్‌రెడ్డి తల్లికి చికిత్స జరుగుతుండటంతో మీడియా దృష్టి మొత్తం అటే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్భాటం లేకుండా మేయర్‌ ఆ స్థలం వద్దకు చేరుకుని ఐదు నిమిషాల్లోనే టెంకాయ కొట్టి పూజలు చేశారు. ఆ స్థలంలో ఓ మూలన భవన నిర్మాణానికి అవసరమయ్యే సిమెంటు నిల్వ చేసేందుకు చిన్నపాటి షెడ్డు నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు