మనవాళ్లే.. కొనసాగించండి!
రాష్ట్రంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవో) పదోన్నతులు కల్పించడంతో ఖాళీ అయిన పోస్టుల్లో నియమించిన ఇన్‌ఛార్జీలు ప్రస్తుతం అక్కడి నుంచి కదలడం లేదు.
ఇన్‌ఛార్జి ఎంపీడీవోలకు మంత్రులు, ఎమ్మెల్యేల అండ
271 మండలాల్లో రెగ్యులర్ ఎంపీడీవోలు లేరు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవో) పదోన్నతులు కల్పించడంతో ఖాళీ అయిన పోస్టుల్లో నియమించిన ఇన్‌ఛార్జీలు ప్రస్తుతం అక్కడి నుంచి కదలడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఆశీస్సులతో మండలాల్లో చక్రం తిప్పుతున్నారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవోల స్థానంలో రెగ్యులర్ అధికారుల నియామకం కోసం ఉన్నతస్థాయిలో ఇప్పటికే ఒకటి, రెండు సార్లు చేసిన ప్రయత్నం ఎమ్మెల్యేల జోక్యంతో బెడిసికొట్టింది. ఇన్‌ఛార్జులనే కొనసాగించాలని కొన్ని జిల్లాలకు చెందిన మంత్రుల సైతం ఉన్నతాధికారులకు సూచిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని 271 మండలాల్లో తొమ్మిది నెలలుగా ఇన్‌ఛార్జి ఎంపీడీవోల పాలన కొన‘సాగు’తోంది. రాష్ట్రంలోని 236 మంది ఎంపీడీవోలకు 2022 ఆగస్టులో పదోన్నతులు కల్పించారు. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీల్లో ఈవోపీఆర్డీలు, సూపరింటెండెంట్లకు ఇన్‌ఛార్జులుగా అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. ఇందులోనూ పలు చోట్ల స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులపై జూనియర్లైన ఈవోపీఆర్డీలు, సూపరింటెండెంట్లకు ప్రాధాన్యమిచ్చారు. ఇన్‌ఛార్జిల కారణంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులపై కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు లేఖలు రాస్తున్నారు. రెగ్యులర్ ఎంపీడీవోలను నియమించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే సీనియర్ సూపరింటెండెంట్లు, ఈవోపీఆర్డీలకు ఎంపీడీవోలుగా పదోన్నతుల కోసం కొద్ది నెలల క్రితం సీనియారిటీ జాబితా తయారు చేసి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంది. జాబితాకు పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఆమోదం లభించిన తరవాత జీవో విడుదల చేయాలి.
కీలక స్థానాల్లో నుంచి కదలకుండా అడ్డుపుల్ల
చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ తదితర జిల్లాల్లోని దాదాపు 35 మండలాల్లో ఎంపీడీవో పోస్టులు అత్యంత కీలకం. ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉండే ఈ మండలాల్లో పని చేసేందుకు ఎంపీడీవోలు అత్యధిక ప్రాధాన్యమిస్తుంటారు. వీటిలో అన్ని చోట్లా ఇన్‌ఛార్జులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరులో అత్యధికంగా 20 ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైయస్‌ఆర్‌లో 16 ఖాళీల్లో ఇన్‌ఛార్జులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Adipurush: ‘ఆది పురుష్’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్
-
World News
China: రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!
-
General News
Isro-Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్12.. ప్రయోగం విజయవంతం
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
-
Sports News
MS Dhoni: రిజర్వ్‌డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?