‘చల్లంపల్లె ప్రాజెక్టు’ పరిహారం చెల్లింపుపై రైతులతో సమావేశం

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం చల్లంపల్లె ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో సోమవారం చిత్తూరు ఆర్డీవో రేణుక, ఇన్‌ఛార్జి తహసీల్దారు అమరనాథ్‌ సమావేశమయ్యారు.

Published : 23 May 2023 04:44 IST

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం చల్లంపల్లె ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో సోమవారం చిత్తూరు ఆర్డీవో రేణుక, ఇన్‌ఛార్జి తహసీల్దారు అమరనాథ్‌ సమావేశమయ్యారు. ‘మాట తప్పిన మంత్రి పెద్దిరెడ్డి’ శీర్షికతో సోమవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం హుటాహుటిన రొంపిచెర్ల తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో జలవనరుల శాఖ అధికారులూ పాల్గొన్నారు. ప్రాజెక్టులో ఎన్ని ఎకరాలు ముంపునకు గురయ్యాయి? ఎంతమంది రైతులు ఉన్నారు? పరిహారం ఎంత రావాలి? అన్న విషయంపై ఆరా తీశారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని త్వరలోనే అన్నదాతలకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు