Amaravati: సీఎం జగన్‌ కాన్వాయ్‌కి అడ్డుగా వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్‌

సీఎం కాన్వాయ్‌కి ఓ హెడ్‌కానిస్టేబుల్‌ అడ్డుపడేందుకు ప్రయత్నించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గుంటూరు వెళ్లిన సీఎం హెలికాప్టర్‌లో తిరిగి తాడేపల్లి చేరుకున్నారు.

Updated : 24 May 2023 14:07 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: సీఎం కాన్వాయ్‌కి ఓ హెడ్‌కానిస్టేబుల్‌ అడ్డుపడేందుకు ప్రయత్నించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గుంటూరు వెళ్లిన సీఎం హెలికాప్టర్‌లో తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి సీఎం తన వాహనంలో నివాసానికి బయలుదేరారు. గార్డు-1 కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న విశాఖకు చెందిన 16వ ఏపీఎస్పీ బెటాలియన్‌ బి-కంపెనీలో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్‌ పెద్దిరెడ్డి భాగ్యరాజు అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఇంతలో వాహన శ్రేణిలో ఉన్న సీఎం భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ హెడ్‌కానిస్టేబుల్‌ని అదుపులోకి తీసుకున్నారు. తాను విశాఖలో పనిచేస్తుండగా తన భార్య విజయవాడలో పని చేస్తోందని ఇద్దరినీ ఒకే చోట పనిచేసేందుకు అవకాశమివ్వాలని సీఎంకు విన్నవించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు విచారణలో తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని