నిధుల వ్యయంపై.. ఆన్‌లైన్‌లో ముందస్తు ఆడిట్
రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో నిధుల వ్యయానికి సంబంధించి ఆడిట్‌శాఖ ఇక నుంచి ఆన్‌లైన్‌లో ముందస్తు ఆడిట్ చేయనుంది.
పట్టణ స్థానిక సంస్థల్లో.. ఆడిట్ శాఖ కొత్త విధానం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో నిధుల వ్యయానికి సంబంధించి ఆడిట్‌శాఖ ఇక నుంచి ఆన్‌లైన్‌లో ముందస్తు ఆడిట్ చేయనుంది. పట్టణ స్థానిక సంస్థల సాధారణ నిధుల్లో నుంచి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) ద్వారా చేస్తున్న చెల్లింపులపై ముందస్తు ఆడిట్‌ను తప్పనిసరి చేస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు ఆమోదించాక ఇప్పటివరకు ఖజానా శాఖకు వెళ్లాక చెల్లింపులు జరుగుతున్నాయి. ఇక నుంచి ఖజానా శాఖకు బదులుగా ఆడిట్ శాఖకు ఆన్‌లైన్‌లో పంపే బిల్లులను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. లోపాలుంటే అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ వెనక్కి పంపి, సరిచేసి మళ్లీ పంపాలని సూచిస్తారు. అన్నీ సవ్యంగా ఉన్నట్లైతే ఆమోదించి, బిల్లుల చెల్లింపులకు అనుమతిస్తారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలకు సంబంధించి మరుసటి ఏడాదిలో మే నెల తర్వాత ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లేవనెత్తే అభ్యంతరాలను పట్టణ స్థానిక సంస్థల అధికారులు సకాలంలో పరిష్కరించడం లేదు. అవి ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంటున్నాయి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ‘ప్రీ ఆడిట్ ప్రొటోకాల్’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక, ఆడిట్, పురపాలక శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యాయి. సీఎఫ్‌ఎంఎస్ నుంచి ఒక లూప్ (లింక్)ని ఆడిట్ శాఖకు అనుసంధానించనున్నారు. ఆడిట్ శాఖ అధికారులు తమ కార్యాలయాల్లో నుంచే సీఎఫ్‌ఎంఎస్ ద్వారా చెల్లించే బిల్లులను ఆన్‌లైన్‌లో ఆడిట్ చేస్తారు. రాబోయే రోజుల్లో ఆర్థిక సంఘం నిధుల వ్యయానికి సంబంధించి కూడా ముందస్తు ఆడిట్ చేయాలని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Politics News
‘ఆ విగ్రహాన్ని తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తా!’.. మాజీ మంత్రి చిన్నారెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం