నేడు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు గురువారం ఉదయం 9.30 గంటలకే విడుదల కానున్నాయి.

Updated : 25 May 2023 06:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు గురువారం ఉదయం 9.30 గంటలకే విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు వెల్లడిస్తామని మంగళవారం ప్రకటించిన అధికారులు.. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ఉండటం, దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు. ఎంసెట్‌ ఫలితాలను www.eamcet.tsche.ac.in,www.eenadu.net, www.eenadupratibha.net తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని