దసపల్లా భూముల్లో పట్టాలు ఇవ్వండి: జనజాగరణ సమితి

అమరావతి రాజధాని బృహత్తర ప్రణాళికను విధ్వంసం చేయాలనే కుట్రలో భాగంగా సీఎం జగన్‌ పేదలను పావులుగా వాడుకుని వారికి చెల్లని ఇళ్లపట్టాలు పంపిణీ చేసి మభ్యపెడుతున్నారని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు.

Published : 26 May 2023 04:19 IST

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: అమరావతి రాజధాని బృహత్తర ప్రణాళికను విధ్వంసం చేయాలనే కుట్రలో భాగంగా సీఎం జగన్‌ పేదలను పావులుగా వాడుకుని వారికి చెల్లని ఇళ్లపట్టాలు పంపిణీ చేసి మభ్యపెడుతున్నారని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. చెల్లని పట్టాలు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. హైకోర్టు తుదితీర్పు వ్యతిరేకంగా వస్తే ఈ పట్టాలు ఎందుకూ పనికిరావనే విషయాన్ని పేదలు గుర్తించాలని కోరారు. సీఎం జగన్‌కు పేదల విషయంలో చిత్తశుద్ధి ఉంటే విశాఖ నడిబొడ్డున ఉన్న దసపల్లా భూముల్లో ఇళ్లపట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు