పునాది దశ నుంచి నాణ్యమైన విద్య అందించాలి

పునాది దశ నుంచే పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తూ వారిలో సామర్థ్యాలను మెరుగుపర్చాలని సమగ్ర శిక్షా అభియాన్‌ సీమ్యాట్‌ డైరెక్టర్‌ మస్తానయ్య సూచించారు.

Published : 26 May 2023 04:43 IST

సమగ్ర శిక్షా అభియాన్‌ సీమ్యాట్‌ డైరెక్టర్‌ మస్తానయ్య

ఈనాడు, అమరావతి: పునాది దశ నుంచే పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తూ వారిలో సామర్థ్యాలను మెరుగుపర్చాలని సమగ్ర శిక్షా అభియాన్‌ సీమ్యాట్‌ డైరెక్టర్‌ మస్తానయ్య సూచించారు. పిల్లలకు సృజనాత్మక కళలు నేర్పించడం ద్వారా ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దొచ్చని, దీన్ని ఉపాధ్యాయులు బాధ్యతగా భావించాలని వెల్లడించారు. విజయవాడలో ఆరు రోజులపాటు నిర్వహించనున్న అభ్యాసన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో అభ్యసన అంతరాలను తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1, 2 తరగతులు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ముందుగా రిసోర్సు పర్సన్లకు శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

హీల్‌ సంస్థకు రూ.2.10 లక్షల విరాళం

హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ (హీల్‌) స్వచ్ఛంద సంస్థకు పాఠశాల నాయకత్వ శిక్షణ రిసోర్సు పర్సన్లు రూ.2.10 లక్షల విరాళం అందించినట్లు సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 17 నుంచి 24 వరకు నిర్వహించిన స్కూల్‌ లీడర్‌ షిప్‌ శిక్షణ కార్యక్రమంలో అనేకమంది రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు. వీరందరూ కలిసి హిల్‌ సంస్థకు సహాయం అందించారు. ఎంతో మంది నిరాశ్రయులైన పేద, అనాథ, అంధ విద్యార్థులతోపాటు వివిధ రకాల అణగారిన పిల్లలకు ఉచితంగా విద్యా, వసతి కల్పించి ఉద్యోగంలో స్థిరపడేందుకు హీల్‌ సంస్థ సహాయం అందిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు