షరతులకు లోబడే ఇళ్ల పట్టాల హక్కులు వర్తిస్తాయి
షరతులకు లోబడే ఇళ్ల స్థలాల పట్టాల హక్కులు వర్తిస్తాయని తాము జారీ చేసిన మంజూరు పత్రాలలో రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.
రెవెన్యూ అధికారుల స్పష్టీకరణ
గుంటూరు (జిల్లాపరిషత్తు), న్యూస్‌టుడే: షరతులకు లోబడే ఇళ్ల స్థలాల పట్టాల హక్కులు వర్తిస్తాయని తాము జారీ చేసిన మంజూరు పత్రాలలో రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్‌ఎల్‌పీ నంబరు 9943-9945/2023లో రెండు అంశాలు చేర్చారని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లలో ఇవ్వాల్సిన ఉత్తర్వులకు లోబడి పట్టా జారీ చేస్తామని పేర్కొన్నారు. తీర్పు వ్యతిరేకంగా వచ్చినట్లయితే మంజూరుదారు ఏదైనా ప్రత్యేక ఈక్విటీని వాదించడానికి అర్హత కలిగి ఉండబోరని మంజూరు పత్రంలో ప్రస్తావించారు. ఆర్-5 జోన్‌లో రాజధానేతర గ్రామాల ప్రజలకు స్థలాలను కేటాయించడంపై హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం హడావుడిగా ఇళ్ల స్థలాల పట్టాలనిచ్చింది. స్థలాల పంపిణీకి సుప్రీంకోర్టు అనుమతినిచ్చినప్పటికీ హైకోర్టు తుది తీర్పు మేరకు లబ్ధిదారులు వ్యవహరించాల్సి ఉంటుందని మంజూరు పత్రాల్లో తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు పైవిధంగా పత్రాల్లో చేర్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
-
Crime News
Vizag: విశాఖ జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి
-
Ap-top-news News
Andhra News: ఈ-ఆటోల తరలింపు ఎలా?.. తల పట్టుకున్న అధికారులు
-
Crime News
Vizag: విశాఖ రైల్వే స్టేషన్లో 18 నెలల చిన్నారి కిడ్నాప్
-
Politics News
TDP: లోకేశ్‌కు చిన్న హాని జరిగినా జగన్‌దే బాధ్యత