ఇసుక తవ్వకాలతో మా కడుపు కొట్టొద్దు

ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చి తమ కడుపులు కొట్టొద్దని తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి పరివాహక ప్రాంత రైతులు అధికారులకు విన్నవించారు.

Published : 28 May 2023 05:10 IST

ఎనిమిది గ్రామాల రైతుల నిరసన

నాయుడుపేట, న్యూస్‌టుడే: ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చి తమ కడుపులు కొట్టొద్దని తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి పరివాహక ప్రాంత రైతులు అధికారులకు విన్నవించారు. మడఫలం, వేమగుంటపాళెం, కాలువగట్టు, కూచివాడ, కూచివాడపాళెం, చిలమత్తూరు, కాపులూరు గునపాడు, గునపాటిపాళెం గ్రామాలకు చెందిన రైతులు శనివారం ట్రాక్టర్లలో ప్రదర్శనగా తహసీల్దారు కార్యాలయానికి వచ్చి ఇసుక తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. నదీ తీరంలో ఇరువైపులా 1,500 వరకు సాగు, తాగునీటి పంపుసెట్లు ఉన్నాయని.. తవ్వకాల వల్ల భూగర్భ జలమట్టాలు తగ్గిపోయి నీటి ఎద్దడి తలెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పొలాలను బీళ్లుగా వదిలేయాల్సి వస్తోందని వాపోయారు. అనంతరం తహసీల్దారు రాజేంద్రకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, రైతుల సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, రైతులు శ్రీధర్‌రెడ్డి, ధనంజయరెడ్డి, కూచివాడ సర్పంచి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు