Heat Waves: నేడు, రేపు వడగాడ్పులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటేశాయి. శనివారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లె మండలం చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.
తగ్గని భానుడి భగభగలు
అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటేశాయి. శనివారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లె మండలం చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 5 చోట్ల 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం 35 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం 12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అధికంగా గుంటూరులో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైయస్‌ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: అభిమానులను మిస్ అయిన నివేదా.. చాట్ చేసేందుకు నర్గిస్ వెయిటింగ్!
-
Palnadu: తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు
-
Disney+Hotstar: క్రికెట్ ఫ్యాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్లతో రెడీ
-
Revanth Reddy: మోదీ నోట.. చీకటి మిత్రుడి మాట: రేవంత్
-
Vivek Ramaswamy: వివేక్ పిల్లల.. ‘కేర్ టేకర్’ జీతం రూ.80లక్షలు..?
-
Arunachal Border: భారత సరిహద్దులో.. చైనా, పాకిస్థాన్‌ల సమావేశం!