పార్లమెంటులో ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమానికి అనుమతి

పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమం నిర్వహణకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనుమతిచ్చారు.

Updated : 28 May 2023 05:21 IST

ఈనాడు, దిల్లీ: పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమం నిర్వహణకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనుమతిచ్చారు. పార్లమెంటు నూతన భవన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రాంగణంలోని ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించకూడదని లోక్‌సభ సచివాలయం ఆంక్షలు విధించిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. తమ పార్టీ వ్యవస్థాపకుడి శతజయంతి ఉత్సవం ఉందని, అత్యంత అరుదైన ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఆవరణలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు అనుమతివ్వాలని కోరారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అందుకు అనుమతిచ్చారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని