Bopparaju: ఉద్యోగ సంఘాల్లో చీలికలు తెచ్చి ఉద్యమాన్ని ఆపలేరు: బొప్పరాజు

తాము సాగిస్తున్న ఉద్యమం కేవలం ఉద్యోగుల కోసమేనని, నాయకుల ప్రయోజనం కోసం కాదని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Updated : 28 May 2023 09:49 IST

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: తాము సాగిస్తున్న ఉద్యమం కేవలం ఉద్యోగుల కోసమేనని, నాయకుల ప్రయోజనం కోసం కాదని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మూడో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏలూరులో శనివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ముందుగా ఉద్యోగులు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన సదస్సులో పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలతో పాటు వివిధ జిల్లాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కె.రమేశ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథి బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 80 రోజులుగా ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు మరో ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టక ముందే సమస్యలన్నింటిని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ సంఘాల్లో చీలికలు తెచ్చి ఉద్యమాన్ని ఆపలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదర్‌రావు, రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి    కృష్ణమూర్తి, పురపాలక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని