Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం

కాకినాడ నుంచి కొవ్వూరు వరకు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.. అంతలోనే ఆకాశం మేఘావృతమై బలమైన ఈదురు గాలులు వీచాయి.

Updated : 29 May 2023 08:29 IST

న్యూస్‌టుడే యంత్రాంగం: కాకినాడ నుంచి కొవ్వూరు వరకు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.. అంతలోనే ఆకాశం మేఘావృతమై బలమైన ఈదురు గాలులు వీచాయి. గాలులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సుమారు 40 నిమిషాల పాటు గాలులు ఆపైన సుమారు గంటపాటు వర్షం.. దీంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామర్లకోటలో ట్రాక్‌పై స్తంభాలు నేలకొరగడంతో మూడు రైళ్లు దాదాపు రెండుగంటలకు పైగా ఆలస్యంగా నడిచాయి. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ఈదురుగాలులకు విద్యుత్తు తీగలపై చెట్లు పడి 35 స్తంభాల వరకు నేలకొరిగాయి. కాకినాడ జిల్లాలో భారీ చెట్లు రెండు కార్లపై పడడంతో నుజ్జునుజ్జయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని