రామచంద్రయాదవ్ గృహ నిర్బంధం
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వ్యాపారవేత్త రామచంద్రయాదవ్‌ను ఆదివారం స్థానిక పోలీసులు గృహనిర్బంధం చేశారు.
కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు
పుంగనూరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వ్యాపారవేత్త రామచంద్రయాదవ్‌ను ఆదివారం స్థానిక పోలీసులు గృహనిర్బంధం చేశారు. సోమల మండలం ఆవులపల్లె రిజర్వాయర్ సందర్శన, ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను కలవడానికి ఆయన తన అనుచరులతో బయలుదేరడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక కొత్తఇండ్లులోని ఆయన ఇంటిని చుట్టుముట్టారు. రిజర్వాయర్ సందర్శనకు వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని గృహ నిర్బంధం చేస్తున్నట్లు ఆయన ఇంటికి ఎస్సై మోహన్‌కుమార్ నోటీసు అతికించారు. అధికార పార్టీ వారికి లేని నిబంధనలు తమకే ఎందుకు వర్తిస్తాయని ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆవులపల్లెకు జూన్ 2న వెళ్లి బాధిత రైతులతో మాట్లాడి వారికి అండగా నిలబడతానని రామచంద్రయాదవ్ చెప్పారు. శాంతిభద్రతల పేరుతో గృహ నిర్బంధం చేయడం విడ్డూరంగా ఉందని, సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లాలన్నా అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆయన కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైౖ సీఆర్‌పీఎఫ్ వర్గాలు ఆరా తీశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ