ప్రజల హృదయాలను ఏలిన నేత ఎన్టీఆర్‌

దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్‌కీ బాత్‌ కార్యక్రమం ద్వారా ఘన నివాళి అర్పించారు.

Updated : 29 May 2023 06:04 IST

‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని మోదీ ఘన నివాళి

ఈనాడు, దిల్లీ: దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్‌కీ బాత్‌ కార్యక్రమం ద్వారా ఘన నివాళి అర్పించారు. ప్రజల హృదయాలను ఏలిన నేతగా ఆయన్ను అభివర్ణించారు. ‘దేశ ప్రజలారా నేనిప్పుడు అద్భుత ప్రతిభా పాటవాలతో రాజకీయాలు, సినిమా పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన ఓ మహనీయుడి గురించి చెప్పబోతున్నా.. ఆయన పేరు ఎన్‌టీ రామారావు. మనందరికీ ఆయన ఎన్టీఆర్‌గా సుపరిచితం. ఈ రోజు ఎన్టీఆర్‌ శతజయంతి. తన బహుముఖ ప్రజ్ఞతో తెలుగు చిత్రసీమలో కథానాయకుడిగా కోట్ల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన 300కు పైగా సినిమాల్లో నటించిన సంగతి మీకు తెలుసా? తన నటనా పటిమతో ఎన్నో ఇతిహాస పాత్రలకు జీవం పోశారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడులాంటి అనేక పాత్రలలో ఎన్టీఆర్‌ నటనని ప్రజలు విశేషంగా ఇష్టపడ్డారు. ఇప్పటికీ ఆయన్ను ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎన్టీఆర్‌ సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇక్కడా ఆయన ప్రజల నుంచి ప్రేమ, ఆశీర్వాదాలు పొందారు. ఎన్టీఆర్‌కు నా వినమ్రపూర్వక నివాళులర్పిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు