చేతులెత్తేసిన పోలీసులు

తెలుగు దేశం పార్టీ రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వద్ద ఆదివారం నిర్వహించిన మహానాడు బహిరంగ సభకు మొత్తం 1,400 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు.

Published : 29 May 2023 06:56 IST

పిఠాపురం, జగ్గంపేట గ్రామీణం, కంబాలచెరువు, కడియం న్యూస్‌టుడే: తెలుగు దేశం పార్టీ రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వద్ద ఆదివారం నిర్వహించిన మహానాడు బహిరంగ సభకు మొత్తం 1,400 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. పలుచోట్ల పార్కింగ్‌ విషయంలో వాహనదారులు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. వాహనాలను పార్కింగ్‌ స్థలాల వైపు మళ్లించడంపై పోలీసులు అంతగా దృష్టి సారించలేదు. ఉదయం 11గంటల నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కార్యకర్తలు వేలాదిగా రావడంతో రద్దీ పెరిగింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్యలు ఎదురయ్యాయి. చాలామంది వీఐపీలు వాహనాలు దిగి వేదిక వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ట్రాఫిక్‌ నియంత్రణకు తెలుగు తమ్ముళ్లు తమ వంతు సాయం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని